జైషే మహ్మద్ అధినేత మసూద్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

- October 09, 2018 , by Maagulf
జైషే మహ్మద్ అధినేత మసూద్‌ ఆరోగ్య పరిస్థితి విషమం

జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్‌ అజహర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో భారత్‌, అఫ్గనిస్థాన్‌లలో జిహాదీ దాడులను అతని సోదరులు రాఫ్‌ అస్గర్‌, అత్తర్‌ ఇబ్రహీం పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. 50 ఏళ్ల మసూద్‌ ప్రస్తుతం వెన్నెముక, మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని ఓ అధికారి తెలిపారు. 'రావల్పిండిలోని ఓ మిలటరీ ఆస్పత్రిలో మసూద్‌ చికిత్స పొందుతున్నాడు. ఏడాదిన్నరగా అతడు మంచానికే పరిమితమయ్యాడు' అని ఆయన తెలిపారు. భారత్‌లో జరిగిన చాలా టెర్రరిస్ట్ దాడులకు మసూద్ సూత్రధారి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com