నొప్పిని భరిస్తున్నా..సోనాలీ
- October 09, 2018
ముంబయి: బాలీవుడ్ కథానాయిక సోనాలి బింద్రే క్యాన్సర్తో బాధపడుతూ న్యూయార్క్లో చికిత్స తీసుకుంటున్నారు. సోనాలి పరిస్థితి నిలకడగా ఉందని ఆమె భర్త గోల్డీ బెహెల్ ఇటీవల తెలిపారు. కాగా, చికిత్స క్రమంలో చాలా నొప్పిని భరిస్తున్నట్లు ఆమె తాజాగా చెప్పారు. తన ఆవేదనను తెలుపుతూ సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేశారు. దీంతోపాటు ఓ ఫొటోను షేర్ చేశారు.
గత కొన్ని నెలలుగా నాకు మంచి, చెడు రెండూ ఎదురయ్యాయి. నేను చాలా బలహీనపడిపోయి.. కనీసం చేతి వేలు పైకి ఎత్తడానికి శక్తిలేక బాధపడ్డాను. ఇది కూడా ఓ ప్రక్రియలా అనిపిస్తోంది. శారీరకంగా ప్రారంభమైన ఈ నొప్పి.. మానసికంగా, ఎమోషనల్గా దెబ్బతీస్తోంది. కీమో థెరపీ, సర్జరీ తర్వాత కొన్ని రోజులు చాలా కష్టమైంది.. కనీసం నవ్వినా నొప్పి వచ్చేది. కొన్నిసార్లు క్యాన్సర్ నా నుంచి మొత్తం తీసేసుకుంటున్న భావన కలుగుతోంది. ప్రతి నిమిషం నాతో నేను పోరాటం చేస్తున్నా. ఇలాంటి చెడు రోజులు జీవితంలో కచ్చితంగా వస్తుంటాయి. దాన్ని ఎదుర్కొని సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







