అక్కినేని నాగ చైతన్య, సమంతల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!!
- October 10, 2018టాలీవుడ్ మోస్ట్ క్రేజియెస్ట్ కపుల్ సమంత, నాగ చైతన్య పెళ్ళి తర్వాత తొలిసారి కలిసి నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ ప్రారంభమయ్యింది.. నాగ చైతన్య 17 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లెంగ్తీ షెడ్యూల్ లో నాగ చైతన్య, సమంత పాల్గొంటుండగా, వీరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా కావడం విశేషం.. 'నిన్నుకోరి ' సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.. దివ్యాన్ష కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజులు ఇతర ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు.. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నారు.. షైన్ స్క్రీన్ బ్యానర్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. పెళ్లి తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది..
నటీనటులు :
నాగ చైతన్య, సమంతా, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ళ భరణి, రవి ప్రకాష్, కరణ్ మరియు రాజశ్రీ నాయర్
సాంకేతిక నిపుణులు :
రచన మరియు దర్శకత్వం: శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్స్ బ్యానర్
సంగీతం: గోపీ సుందర్
డిఓపి : విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: సాహీ సురేష్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
యాక్షన్: వెంకట్
PRO: వంశీ శేఖర్
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్