ఇరాన్ అదుపులో కర్నాటక జాలర్లు
- October 11, 2018
బెంగళూరు: కర్నాటకకు చెందిన తొమ్మిది మంది జాలర్లు ఇరాన్ అదుపులో ఉన్నారు. వీరంతా ఉత్తర కన్నడ జిల్లా సముద్రతీర పట్టణం బత్కల్కు చెందినవారు. దుబాయ్‌లో పనిచేసే వీరంతా గడిచిన ఏప్రిల్ 25వ తేదీన బత్కల్ నుంచి దుబాయ్‌కు బోటులో బయల్దేరి వెళ్లారు. జులై 21వ తేదీన అక్కడి సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అనుకోకుండా ఇరాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి అధికారులు వీరందరిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బోటులోనే నిర్బంధించారు. నిత్యావసారాల నిమిత్తం ఈ తొమ్మిది మందిలో ఏవరో ఒకరు ప్రతిరోజూ బయటికి వెళ్లి తమకు కావాల్సిన వస్తువులను తీసుకొచ్చేవారు. సహాయం కోరుతూ అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించారు. దీంతో జాలర్ల విడుదలకు భారత అధికారులు చర్యలు చేపట్టారు. మరో నెలలో వీరంతా విడుదల కానున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







