"సైరా" లో విజయ్ సేతుపతి, సుదీప్ సరికొత్త లుక్
- October 11, 2018
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రంతో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, సుదీప్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
నేడు అమితాబ్ 76వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ మోషన్ టీజర్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అందుకే ఆయా భాషల నుంచి అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ లను కూడా కీలకమైన పాత్రల కోసం తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సుదీప్ ల ఫస్టులుక్ లను విడుదల చేశారు.
విభిన్నమైన వేషధారణతో ఇద్దరూ కూడా సరికొత్తగా కనిపిస్తున్నారు ఈ లుక్ లో. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







