ఇరాన్ అదుపులో కర్నాటక జాలర్లు

- October 11, 2018 , by Maagulf
ఇరాన్ అదుపులో కర్నాటక జాలర్లు

బెంగళూరు: కర్నాటకకు చెందిన తొమ్మిది మంది జాలర్లు ఇరాన్ అదుపులో ఉన్నారు. వీరంతా ఉత్తర కన్నడ జిల్లా సముద్రతీర పట్టణం బత్కల్‌కు చెందినవారు. దుబాయ్‌లో పనిచేసే వీరంతా గడిచిన ఏప్రిల్ 25వ తేదీన బత్కల్ నుంచి దుబాయ్‌కు బోటులో బయల్దేరి వెళ్లారు. జులై 21వ తేదీన అక్కడి సముద్ర జలాల్లో చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో అనుకోకుండా ఇరాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో అక్కడి అధికారులు వీరందరిని నిర్బంధంలోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి బోటులోనే నిర్బంధించారు. నిత్యావసారాల నిమిత్తం ఈ తొమ్మిది మందిలో ఏవరో ఒకరు ప్రతిరోజూ బయటికి వెళ్లి తమకు కావాల్సిన వస్తువులను తీసుకొచ్చేవారు. సహాయం కోరుతూ అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించారు. దీంతో జాలర్ల విడుదలకు భారత అధికారులు చర్యలు చేపట్టారు. మరో నెలలో వీరంతా విడుదల కానున్నట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com