"సైరా" లో విజయ్ సేతుపతి, సుదీప్ సరికొత్త లుక్
- October 11, 2018కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రంతో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, సుదీప్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
నేడు అమితాబ్ 76వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ మోషన్ టీజర్ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్ కనిపిస్తాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అందుకే ఆయా భాషల నుంచి అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ లను కూడా కీలకమైన పాత్రల కోసం తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సుదీప్ ల ఫస్టులుక్ లను విడుదల చేశారు.
విభిన్నమైన వేషధారణతో ఇద్దరూ కూడా సరికొత్తగా కనిపిస్తున్నారు ఈ లుక్ లో. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.
తాజా వార్తలు
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..