CTS: 200 మంది ఉద్యోగస్తులకు గుడ్ బై
- October 11, 2018
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సీటీఎస్) సాఫ్ట్వేర్ కంపెనీల్లో దిగ్గజ సంస్థ. ప్రస్తుతం ఈ కంపెనీలో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కంపెనీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కంపెనీకి సేవలందించిన 200 మంది ఉద్యోగస్తులపై వేటు వేసింది. అంతేకాదు వారికి 3 నుంచి 4 నెలల జీతం కూడా ఇచ్చింది. కొత్త డిజిటల్ టెక్నాలజీ సేవల వినియోగించుకునేందుకు కొత్త రక్తాన్ని కంపెనీ కోరుకుంటోందని వివరించింది. నూతన టెక్నాలజీపై పట్టు సాధించని ఉద్యోగస్తులకు గుడ్‌బై చెప్పి కొత్త నైపుణ్యం ఉన్న వ్యక్తులను నియమించుకునేందుకు సంస్థ రంగం సిద్ధం చేసిందని యాజమాన్యం వెల్లడించింది.
గతేడాది స్వచ్చందంగా 400 మంది తొలగింపు
కంపెనీలో ఎంతమంది ఉద్యోగులను తొలగించాలి, ఎవరెవరు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకున్నారు అనేదానిపై అన్ని రకాలుగా స్టడీ చేశాకే 200 మంది ఉద్యోగస్తులతో కూడిన జాబితా సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ మొత్తం ఆగష్టులోనే ముగిసింది. ఇక వీరికి మొత్తం 35 మిలియన్ డాలర్లు మేరా యాజమాన్యం చెల్లించనుంది. గతేడాది వాలంటరీ సెపరేషన్ స్కీమ్ పేరుతో 400 మంది ఉద్యోగస్తులను పక్కనబెట్టింది సీటీఎస్ కంపెనీ. అయితే ఈ సారి ఏకంగా 200 మందిపై వేటే వేసింది.
కొత్త టెక్నాలజీ పై పట్టున్న వారికి అవకాశం
తమ వ్యాపార లక్ష్యాలతో పాటు క్లైంట్కు కావాల్సిన అవసరతలను తీర్చేలా ఉండాలని కంపెనీ భావిస్తున్నందున ... కొత్త టెక్నాలజీపై పట్టున్న ఉద్యోగస్తులు కావాలని ఇందుకోసమే ఉద్యోగుల తొలగింపు చాలా వ్యూహాత్మకంగా చేసినట్లు ఒక ప్రకటనలో తెలపింది. ఇందులో భాగంగానే కొందరి ఉద్యోగులను తొలగిస్తే మరికొందరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశామని కంపెనీ వెల్లడించింది. తమ సంస్థలో వినియోగిస్తున్న టెక్నాలజీపై పట్టున్న వారికి అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే తొలగింపునకు గురైన ఉద్యోగులకు ఎంత చెల్లిస్తున్నామనేది బహిర్గతం చేయలేమని వెల్లడించింది.
న్యాయపరమైన చర్యలు..రిలీజ్ డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్న యాజమాన్యం
కంపెనీతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు పరస్పర విడుదల ఒప్పందంపై సంతకాలు చేయాల్సిందిగా కంపెనీ యాజమాన్యం తమను కోరిందని తొలగింపునకు గురైన ఉద్యోగస్తులు చెప్పారు. కంపెనీని వీడిన తర్వాత న్యాయపరంగా కానీ, చట్టపరంగా కానీ కంపెనీ పైన లేదా డైరెక్టర్స్, ఆఫీసర్స్ పైనా ఎలాంటి చర్యలు తీసుకోబోమని తెలుపుతూ రిలీజ్ డాక్యుమెంట్‌పై సంతకాలు తీసుకున్నారని చెప్పారు. అంతేకాదు ఒప్పందం కూడా స్వచ్ఛందంగానే జరిగినట్లు రిలీజ్ డాక్యుమెంట్స్‌లో ఉన్నట్లు వారు వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా మళ్లీ కంపెనీలో కొత్త టెక్నాలజీపై పట్టున్న ఉద్యోగస్తులు చేరుతారని యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







