బాలయ్య తో నటించనున్న కళ్యాణ్ రామ్
- October 12, 2018
క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్' బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నారు. తొలి భాగాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు, రెండో భాగాన్ని ఎన్టీఆర్ మహానాయకుడు గా తీసుకురానున్నారు. ఈ రెండు కూడా వచ్చే యేడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు. ఇక, హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడు కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఆయన షూటింగ్ లో పాల్గొన్నారు. తాజాగా, దీనిపై కళ్యాణ్ రామ్ స్పందిస్తూ.. '30 ఏళ్ల క్రితం మా బాబాయ్ తో 'బాలగోపాలుడు' సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు .. బాబాయ్, వాళ్ల నాన్న గారిలా.. నేను, మా నాన్నగారిలా' అని పోస్ట్ చేశారు.
ఈ చిత్రం కోసం కళ్యాణ్ రామ్ 20రోజుల పాటు డేట్స్ కేటాయించినట్టు సమాచారమ్. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం. సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







