బహ్రెయిన్:ఫేక్‌ పాస్‌పోర్ట్‌ కేసులో వ్యక్తికి ఊరట

- October 12, 2018 , by Maagulf
బహ్రెయిన్:ఫేక్‌ పాస్‌పోర్ట్‌ కేసులో వ్యక్తికి ఊరట

బహ్రెయిన్:ఇరాకీ జాతీయుల కోసం పాస్‌పోర్ట్‌ ఫోర్జరీలకు పాల్పడుతున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న బహ్రెయినీ వ్యక్తికి న్యాయస్థానం ఊరటనిచ్చింది. సరైన ఆధారాల్ని చూపలేదన్న కారణంగా నిందితుడిపై అభియోగాల్ని న్యాయస్థానం పక్కన పెట్టింది. గతంలో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ఐదుగురికి సంబంధాలున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అందులో ముగ్గురు ఇరాకీ జాతీయులు. ఐదో నిందితుడు బహ్రెయినీ వ్యక్తి. ఫోర్జరీ కేసులో తనకెలాంటి సంబంధం లేదని న్యాయస్థానానికి ఐదో నిందితుడు మొరపెట్టుకున్నాడు. తనకు ఫోన్‌లో వచ్చిన వాట్సాప్‌ ఇమేజ్‌ని చూశాననీ, ఆ వెంటనే దాన్ని డిలీట్‌ చేశానని అతను చెప్పాడు. మరో బహ్రెయినీ వ్యక్తి ఇరాకీలతో డీల్‌ కుదుర్చుకున్నాడు. మొత్తం 80,000 బహ్రెయినీ దినార్స్‌కి డీల్‌ కుదిరింది. అందులో ఇద్దరు టర్కీకి వెళ్ళారు పాస్‌పోర్ట్‌ ఫోర్జరీ కోసం. దాన్ని బహ్రెయినీ నిందితుడికి ఇచ్చేలా పథకం రచించారు. నేషనాలిటీ పాస్‌పోర్ట్స్‌ అండ్‌ రెసిడెన్స్‌ ఎఫైర్స్‌లో ఓ వ్యక్తికి 30,000 బహ్రెయినీ దినార్స్‌ లంచం ఇచ్చేందుకు యత్నించగా, నిందితుడు ఆ పాస్‌పోర్ట్‌ని కాల్చివేయడం జరిగింది. కాగా, ఈ కేసులో ఇతర నిందితులు, తాము అసలు ఈ విషయంలో చేసిందేమీ లేదనీ, ఫేక్‌ పాస్‌పోర్టుల కోసం అడగలేదని కోర్టుకు విన్నవించారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com