వేల్ షార్క్: అబుదాబీ బీచ్ మూసివేత
- October 12, 2018
అబుదాబీ కోర్నిచ్లోని అల్ బహర్ బీచ్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్యాపిటల్ వాటర్స్‌లో వేల్ షార్క్‌ని కనుగొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ - అబుదాబీ, అంతరించిపోతున్న జలచరాల్లో ఒకటైన వేల్ షార్క్, కసర్ అల్ అమ్వాజ్ ప్రాంతంలో కన్పించిన నేపథ్యంలో చేసిన సూచన మేరకు అబుదాబీలోని ప్రముఖ లీజర్ డెస్టినేషన్ బీచ్‌ని మూసివేయడం జరిగింది. ఈ శుక్రవారం తిరిగి బీచ్‌లోకి సందర్శకుల్ని అనుమతిస్తారని అధికారులు పేర్కొన్నారు. వేల్ షార్క్ ప్రమాదకరమైనది కాదని ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ అబుదాబీ (ఈఏడి) పేర్కొంది. వేల్ షార్క్ గనుక కన్పిస్తే, దానికి దగ్గరగా వెళ్ళరాదని, తగినంత దూరంలో వుండాలని బోటుపై ప్రయాణించేవారిని, స్విమ్ చేసేవారిని అప్రమత్తం చేసింది ఇఎడి. వేల్ షార్క్ నెమ్మదిగా వెళుతుందనీ, ఇది ఫిల్టర్ ఫీడింగ్ కార్పెట్ షార్క్ అనీ పేర్కొన్నారు అధికారులు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







