2019 చివరి నాటికి ముహరాక్‌ నాలుగో బ్రిడ్జి సిద్ధం

- October 12, 2018 , by Maagulf
2019 చివరి నాటికి ముహరాక్‌ నాలుగో బ్రిడ్జి సిద్ధం

బహ్రెయిన్:ముహరాక్‌, బహ్రెయిన్‌ ఐలాండ్స్‌ని కలిపే నాలుగో బ్రిడ్జి 2019 చివరి నాటికి అందుబాటులోకి వస్తుందని ముహరాక్‌ మునిసిపల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ మొహమ్మద్‌ అల్‌ సినాన్‌ చెప్పారు. ఈ కాజ్‌వేకి సంబంధించి అన్ని ఎంట్రన్స్‌లు, ఎగ్జిట్స్‌లు పూర్తయినట్లు పేర్కొన్నారాయన. మనామా మరియు ముహరాక్‌లను కలిపే రోడ్ల లింకింగ్‌ ప్రస్తుతం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ముహరాక్‌ ఐలాండ్‌ నార్తరన్‌ పార్ట్స్‌కి ఈ బ్రిడ్జి ఎంతో వీలుగా వుంటుంది. నాలుగు నుంచి ఐదు లేన్లు ప్రతి డైరెక్షన్‌లో ఈ బ్రిడ్జి కలిగి వుంటుంది. ముహరాక్‌, మనామా మధ్య ట్రాఫిక్‌కి ఈ బ్రిడ్జితో ఉపశమనం లభిస్తుంది. బహ్రెయిన్‌ - సౌదీ సంయుక్తంగా ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నాయి. ముహరాక్‌లోని అల్‌ సయాహ్‌ ప్రాంతాన్ని క్యాపిటల్‌లోని నార్తరన్‌ షోర్స్‌ని కలిపేలా ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్‌ చేశారు.
  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com