'BAPS' హిందూ మందిర్ వెబ్‌సైట్ ప్రారంభం
- October 12, 2018
అబుదాబీ: అబుదాబీలో నిర్మితం కానున్న బిఎపిఎస్ హిందూ మందిర్ పట్ల ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇండియన్ కమ్యూనిటీ పట్ల అభిమానంతో మందిర నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో మందిర్ లిమిటెడ్,www.mandir.ae వెబ్‌సైట్‌ని ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్ ద్వారా బిఎపిఎస్ హిందూ మందిర్‌కి సంబంధించి సమగ్ర సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. బిఎపిఎస్ స్వామినారాయన్ సంస్థ ఈ మందిర నిర్మాణాన్ని చేపడుతోంది. భారత ప్రధాని నరేంద్రమోడీ, లాంఛనంగా ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభించిన సంగతి తెల్సిందే. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అనుమతితో, మందిర్ లిమిటెడ్ వెబ్‌సైట్, మందిర్ నిర్మాణం కోసం విరాళాలు స్వీకరించేందుకు అవకాశం పొందింది. టెలర్ అనే యూఏఈ బేస్డ్ పేమెంట్ గేట్‌వే కంపెనీ ద్వారా సెక్యూర్ బ్యాక్ ఎండ్ పేమెంట్ గేట్‌వే సర్వీసు డోనర్స్ కోసం సేవలు అందిస్తుంది. డోనర్స్ ట్రాన్సాక్షన్ అత్యంత భద్రతతో కూడినది, అలాగే గోప్యత కలిగినదిగా డిజైన్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







