అల్లకల్లోలంగా మారిన అమెరికా..

- October 13, 2018 , by Maagulf
అల్లకల్లోలంగా మారిన అమెరికా..

హరికెన్ మైకెల్ ధాటికి అమెరికా అల్లకల్లోలంగా మారింది. 250 కిలో మీటర్ల ప్రచంఢ వేగంతో దూసుకొచ్చిన తుపాను ధాటికి ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా ప్రాంతాల రూపాలే మారిపోయాయి. తీరం దాటే సమయంలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో మైకెల్ బీభత్సం యుద్ధ క్షేత్రాన్ని తలపించేలా చేసింది. బాంబుల వర్షం కురిసిన తర్వాతి పరిస్థితులు నెలకొన్నాయి అక్కడ. ఇల్లు నెలమట్టం అయ్యాయి. ఎటు చూసిన కుప్పలుగా శిథిలాలే కనిపిస్తున్నాయి. బాంబులతో పేల్చేసినట్లు రోడ్లు ధ్వంసం అయ్యాయి.

అమెరికాలో హరికెన్లు తరచుగా వస్తునే ఉంటాయి. కానీ, మైకెల్ లాంటి తుఫాన్ మాత్రం అమెరికా చరిత్రలోనే లేదు. 250 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన మైకెల్ ముందు ఇల్లు, భవనాలు నిలబడలేకపోయాయి. చెట్లు కూలిపోయాయి. తుఫాన్ ధాటికి మొత్తం 17 మంది చనిపోయారు. ఫ్లోరిడాలో ఎనిమిది మంది, వర్జినియాలో ఐదుగురు, నార్త్ కరోలినాలో ముగ్గురు, జార్జియాలో ఒకరు చనిపోయినట్లు తెలుస్తోంది.

గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వెయ్యి మంది వరకు జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ముందస్తు హెచ్చరికలతో అంతా సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే..285 మంది మాత్రం ముందస్తు హెచ్చరికలను పట్టించుకోలేదు. తుపాన్ తర్వాత వారి జాడ కనిపించటం లేదు. దీంతో 285 మంది కోసం అత్యాధునిక పరికరాలు, శిక్షణ పొందిన శునకాల సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com