అసోం రాజధానిలో బాంబు పేలుడు కలకలం
- October 13, 2018
అసోం రాజధాని గువహటిలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న సుఖ్లేశ్వర్ ఘాట్ దగ్గర.. సుమారు పన్నెండు గంటల సమయంలో ఆకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ దాటికి నదీ తీరం వెంబడి ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. పేలుడు శబ్దంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రజలంతా భయబ్రాంతులకు లోనయ్యారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్లున్న.. నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పేలుడుకు సంబంధించిన వివరాలను సేకరించారు. పేలుడు స్వభావాన్ని బట్టి ఇది విద్రోహ చర్య కాకపోవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. క్లూజ్ టీమ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో.. ఆధారాలు సేకరించారు. ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేసింది. ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోందని, ఆ తర్వాతే స్పష్టత వస్తుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







