17.5 కిలోల డ్రగ్స్ స్వాధీనం, ఐదుగురి అరెస్ట్
- October 13, 2018
అబుదాబీ పోలీసులు 17.5 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఐదుగురు ఆసియాకి చెందిన వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. డ్రగ్స్‌ని దేశంలోని యంగ్‌స్టర్స్‌కి నిందితులు విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీస్ అధికారులు వెల్లడించారు. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ డైరెక్టర్ బ్రిగేడియర్ మొహమ్మద్ సుహైల్ అల్ రషిది ఈ విషయాల్ని వెల్లడించారు. రెండు ఆపరేషన్లలో ఈ అరెస్టులు జరిగాయి. ఓ ఆపరేషన్‌లో 12 కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 8 కిలోల హెరాయిన్, 4 కిలోల క్రిస్టల్ మెత్ వున్నాయి. మరో టనలో 5.5 కిలోల క్రిస్టల్ మిత్‌ని మొబైల్ ఫోన్ షాప్ నుంచి స్వాధీనం చేసుకున్నామని బ్రిగేడియర్ అaలల్ రష్ది చెప్పారు. ఇటీవలే పోలీస్, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్స్‌ని ముమ్మరం చేశాయి. 'మై లైఫ్ ఈస్ ప్రైస్‌లెస్' పేరుతో సెప్టెంబర్‌లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రగ్స్ కారణంగా జీవితాలు ఎలా నాశనమైపోతాయో ఈ కార్యక్రమాలతో అవగాహన కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







