హెయిర్ డై చేస్తుండగా మహిళకు కాలిన గాయాలు
- October 13, 2018
యూ.ఏ.ఈ:సెలూన్లో హెయిర్ డై చేయించుకున్న ఓ మహిళకు కాలిన గాయాలయ్యాయి. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. షార్జా మిస్డెమీనియస్ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఆసియన్ వర్కర్, పొరపాటు కారణంగా ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ఆరోపించడం జరిగింది. ఆ మహిళ సూచన మేరకు హెయిర్ డై చేయడం జరిగిందనీ, ఇంతకు ముందు చాలామందికి చేసినట్లుగానే హెయిర్ డై చేయడం జరిగిందనీ, సెలూన్ నుంచి ఆ మహిళ బయటకు వెళ్ళినప్పుడు ఆమె మామూలుగానే వున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసియన్ వర్కర్ తన వాదనను విన్పించారు. అయితే హెయిర్ డై కోసం వినియోగించిన ఓ పదార్థం కారణంగానే మహిళకు కాలిన గాయాలయినట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చింది. కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!