జడ్జి భార్య, కొడుకు పై గన్‌మన్‌ కాల్పులు

- October 13, 2018 , by Maagulf
జడ్జి భార్య, కొడుకు పై గన్‌మన్‌ కాల్పులు

గురుగ్రామ్‌: నగరంలోని రద్దీ మార్కెట్‌ ప్రాంతంలో ఒక జడ్జిభార్య,ఆతనికుమారుణ్ణి తన వద్ద ఉన్న గన్‌తో కాల్పులుజరిపి అదే కారులో బాడీగార్డు పరారయిన ఉదంతమిది. శనివారం అత్యంతరద్దీగా ఉన్న ఆర్కాడియా మార్కెట్‌వద్ద అదనపు సెషన్స్‌జడ్జి కృష్ణకాంత్‌శర్మ భార్య, రితు, ఆమె కుమారుడు ధృవ్‌ను జడ్జివద్ద నియమితుడైన మహీపాల్‌సింగ్‌ అనే బాడీగార్డు కాల్పులుజరిపినట్లు పోలీసులు ధృవీకరించారు. షాపింగ్‌కు వచ్చిన భార్య కకుమారుడి వెంట వచ్చిన గన్‌మాన్‌ అనుకోకుండా వారిపై కాల్పులుజరిపాడు. గడచిన కొంతకాలంగా ఈతని మానసిక పరిస్థితి స్థిరంగా లేదని, పైగా జడ్జి కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారన్న మిషతో వారిపై మార్కెట్‌వద్దకు రాగానే కాల్పులుజరిపినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అక్కడినుంచి గాలిలోనికి కాల్పులుజరిపి అదేకారులో తిరిగి పరారయ్యాడు. గడచిన రెండేళ్లుగా ఈ జడ్జివద్ద గన్‌మాన్‌ సెక్యూరిటీ గార్డుగా నిచేస్తున్నాడు. వారిపై కాల్పులుజరిపిన తర్వాత మహీపాల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని తిరిగి కాల్పులు జరిపాడు. అక్కడినుంచి పరారయ్యేముందు కాల్పులు జరిపిన ఆతణ్ణి పట్టుకునేందుకుప్రయత్నించారు.

తర్వాత ఫరీదాబాద్‌లో మహీపాల్‌ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నట్లు గురుగావ్‌ ఈస్ట్‌ డిసిపి వెల్లడించారు. ప్రస్తుతం జడ్జి భార్య ,కుమారుణ్ణిఆసుప్రతిలో చేర్పించామని వీరిలో ధృవ్‌పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిపై కాల్పులుజరిపిన తర్వాత మహీపాల్‌ జడ్జికి ఫోన్‌చేసి మీ భార్య,కుమారుడిపై కాల్పులుజరిపానని మరీ చెప్పాడని పోలీసు తెలిపారు. అంతేకాకుండా ఆ తర్వాత మరో ఇద్దరికిసైతం ఫోన్లుచేసి కాల్పులుజరిపినట్లు తెలిపాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com