ఎన్టీఆర్ కెరీర్ లో ఊహించని విజయం..
- October 14, 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. రికార్డులన్నింటినీ చెరిపేస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీకి మాస్ ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. సినిమా తొలివారం ముగిసే సరికి ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ లో 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. విడుదలైన నాలుగు రోజుల్లోనే వందకోట్ల గ్రాస్ వసూలు చేయడమంటే మామూలు విషయం కాదు. బాహుబలి తరువాత ఈ సినిమానే ఆ రికార్డ్ సాధించిందని.. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ డైరెక్షన్.. అన్నింటికీ మించి సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ కారణంగా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇప్పటికే నాన్ బాహుబలి రికార్డ్స్ ను చెరిపేసే దిశగా ఈ చిత్రం ఆడుతుందని వారంటున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో ఊహించనంత విజయం సాధించడంతో హైదరాబాద్లో చిత్రబృందం థాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







