తిత్లీ బాధితులకు అండ.. విజయ్ దేవరకొండ..
- October 14, 2018
సినిమాల్లో హీరోలు అన్యాయాన్ని ఎదిరిస్తారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటారు. కానీ నిజజీవితంలో కూడా అవసరమైనప్పుడు మేమున్నామంటూ ముందుకొచ్చి చేయూతనందిస్తారు కొందరు హీరోలు. వారే నిజమైన హీరో అనిపించుకుంటారు.
మొన్న పక్కరాష్ట్రం కేరళ వరదబాధితుల్ని అక్కున చేర్చుకుని అండగా నిలబడింది తెలుగు ఇండస్ట్రీ. అదే విధంగా ఇప్పుడు తిత్లీ తుఫాన్ వల్ల శ్రీకాకుళం జిల్లాలో వందల గ్రామాలకు భారీ నష్టం సంభవించడంతో సీఎం చంద్రబాబు కేంద్ర సాయాన్ని కోరారు. బాధితులకు అండగా నటుడు సంపూర్ణేష్ బాబు ముందుగా స్పందించి కొంత సాయమందించారు. మరో నటుడు విజయ్ దేవరకొండ రూ.5 లక్షల సాయం ప్రకటించి తన ఉదారతను చాటుకున్నారు.
ఈ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు పంపినట్లు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘లేహ్‌లో ఉన్న తనకు ఇక్కడకు వచ్చాకే తిత్లీ తుఫాను గురించి తెలిసిందని వెంటనే స్పందించానని అన్నారు. గతంలో కేరళను ఆదుకున్న మనం ఇప్పుడు మన వారిని కూడా పెద్దమనసుతో ఆదుకోవాలంటూ విజయ్ పిలుపునిచ్చారు’. ఇంతకు ముందు కూడా తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన 25 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చి తన గొప్పమనసు చాటుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







