నార్తరన్ గవర్నరేట్ స్కూల్‌లో కార్పొరేల్ పనిష్‌మెంట్
- October 15, 2018
బహ్రెయిన్:నార్తరన్ గవర్నరేట్‌లోని ఓ పబ్లిక్ స్కూల్‌లో ఎలిమెంటరీ విద్యను అభ్యసిస్తోన్న తమ చిన్నారిపై టీచర్ దారుణంగా దాడి చేసినట్లు ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు కూడా చేశారు బాధిత చిన్నారి తండ్రి. హోస్‌తో చిన్నారిపై అతి కిరాతకంగా టీచర్ దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తమ చిన్నారి, టీచర్ కొట్టడంతో తీవ్రమైన నొప్పికి గురయ్యాడనీ, బాధతో విలవిల్లాడిన చిన్నారిని అడిగితే, విషయం వెల్లడించడం జరిగిందని బాధితుడి తండ్రి చెప్పారు. తమ చిన్నారిపై దాడికి సంబంధించి స్కూల్ ప్రిన్సిపాల్‌కి కూడా ఫిర్యాదు చేశామని అన్నారు బాధిత చిన్నారి తండ్రి. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌కి వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కొట్టడమే కాకుండా, అసభ్యకరంగా చిన్నారిని టీచర్ తిట్టినట్లు ఫిర్యాదులో వివరించారు బాధిత చిన్నారి తండ్రి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







