ప్రాస్టిట్యూషన్: 8 మందికి జైలు
- October 15, 2018
దుబాయ్:ఏడుగురు పురుషులు, ఓ మహిళ ప్రాస్టిట్యూషన్ కేసులో దోషులుగా తేలారు. దుబాయ్ న్యాయస్థానం వీరికి జైలు శిక్ష ఖరారు చేసింది. అరెస్టయినవారంతా పాకిస్తానీయులే. డిసెంబర్ 7న అల్ మురాక్కాబాత్‌లో, నిందితులు బాధఙతులకు ఫేక్ ఏజ్‌లతో పాస్‌పోర్టులను ఇప్పించినట్లు విచారణలో తేలింది. 17 ఏళ్ళ బాధితురాలు, తమను యూఏఈకి రప్పించి, ప్రాస్టిట్యూషన్ చేయించేందుకు యత్నించారని పేర్కొనడం జరిగింది. నిందితులు, బాధితులకు పాస్‌పోర్ట్, ఎంట్రీ పర్మిట్‌తోపాటుగా విమాన టిక్కెట్లను అందించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో నిందితురాలు, ఆ యువతుల్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వారిని అల్ హమ్రియాలోని ఓ ఇంటికి తరలించారు. ఆ మరుసటి రోజు అల్ బరాహాలోని ఓ ఫ్లాట్‌కి తీసుకెళ్ళారు వ్యభిచారం కోసం. సీఐడీ అధికారులు, డిసెంబర్ 7న ఫ్లాట్‌పై దాడి చేయగా, ప్రాస్టిట్యూషన్ బయటపడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







