నటి రేవతిపై కేసు..
- October 15, 2018
నటి రేవతిపై కొచ్చికి చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్నేళ్ల క్రితం షూటింగ్ సమయంలో 17 ఏళ్ల బాలికపై ఎవరో అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె చెప్పారన్నారు. అయితే ఆ బాధితురాలు పేరు చెప్పకుండా ఆమె దాచారని ఆరోపించాడు కేరళలోని ఎర్నాకులంకు చెందిన సియాజ్ జమాస్ అనే వ్యక్తి. ఈ వ్యవహారంపై నటి రేవతిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదుపై రేవతి స్పందించారు. 17 ఏళ్ల బాలికపై అఘాయిత్యం జరిగిందని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఆ రోజు అర్ధరాత్రి తాను బస చేసిన హోటల్ గదికి కాపాడండి అంటూ ఓ బాలిక, బామ్మ భయంతో తన దగ్గరికి వచ్చారని తెలిపారు. ఆ నైట్ అంతా వారితో నిద్రలేకుండా గడిపినట్లు తెలిపారు. అయితే మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఆ సంఘటన గురించి ప్రస్థావించానని రేవతి వివరించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







