దారుణ ఘటన: ప్రముఖ మోడల్ హత్య...బ్యాగులో మృతదేహం లభ్యం
- October 16, 2018
ముంబై: ఓ అందాల మోడల్ ను హతమార్చి ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగులో పెట్టి చెత్తకుండీలో పడేసిన దారుణ ఘటన ముంబై నగరంలో వెలుగుచూసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని కోట నగరానికి చెందిన మానసి దీక్షిత్ (20) మోడలింగ్ చేస్తున్నారు. ప్రముఖ మోడల్ మానసి దీక్షిత్ ఆరునెలలక్రితం ముంబై నగరానికి వచ్చి అంధేరిలోని మిల్లత్ నగర్ లో నివాసముండేది. అంధేరికి చెందిన సయ్యద్ (19) అనే విద్యార్థి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఓ కార్యక్రమంలో సయ్యద్ కు మోడల్ మానసిదీక్షిత్ తో స్నేహం ఏర్పడింది. మానసి దీక్షిత్ తో గొడవపడిన సయ్యద్ ఆమెను చంపి మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగులో పెట్టి దాన్ని మలాద్ ప్రాంతంలోని మైండ్ స్పేస్ వద్ద పొదల్లో పడేశాడు. స్థానికులు బ్యాగు నుంచి వాసన వస్తుందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వచ్చి బ్యాగు విప్పి చూడగా మోడల్ మానసి దీక్షిత్ మృతదేహం కనిపించింది. రోడ్డుపై సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా సయ్యద్ క్యాబ్ లో తీసుకువచ్చి మృతదేహాన్ని పొదల్లో పడేసినట్లు తేలింది. దీంతో పోలీసులు సయ్యద్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







