హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ కలకలం.. ఆరుగురుమృతి
- October 16, 2018
హైదరాబాద్ లో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. నగరంలో గడిచిన 15రోజుల్లో ఈ స్వైన్ ఫ్లూ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలు భయందోళనకు గురౌతున్నారు. దీనిని అదుపుచేసేందుకు వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు.
వాతావరణంలో సడెన్ గా వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది జ్వరం బారిన పడుతున్నరని వైద్యులు చెబుతున్నారు. రోజురోజుకీ స్వైన్ ఫ్లూ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
దగ్గు, జ్వరం, వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పులు, నీరసించిపోవడం, ఒళ్లుపై గుళ్లలు ఏర్పడటం వంటివి స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఇలాంటి లక్షణాలుంటే తక్షణమే వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. సంవత్సరానికి సరిపడా వాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ స్వైన్ ఫ్లూ అనేది అన్ని వర్గాల వారికి వస్తుందని, ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
ఎక్కువగా నవంబర్-డిసెంబర్ నెలల్లోనే ఈ స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా వస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. రెండు నెలల క్రితంతోపోలిస్తే.. జ్వరపీడితలు ప్రస్తుతం రెట్టింపు అయినట్లు వారు చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!