ధైర్యంగా మాట్లాడండీ:హీరో విశాల్
- October 16, 2018
దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘మీ టు’ ఉద్యమానికి నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శి , హీరో విశాల్ మద్దతు పలికారు. లైంగిక వేధింపులపై తనుశ్రీ దత్తా, సింగర్ చిన్మయి ల ఆరోపణలను గౌరవిస్తూ ట్వీట్ చేశారు విశాల్.. ‘ఇదే కరెక్ట్ టైమ్. సినీ రంగంలో మహిళలు ధైర్యంగా మాట్లాడండీ. మీకు నేను అండగా ఉంటా. భద్రత కల్పించడానికి ఓ కమిటీగా ఏర్పడతాం. లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా బయట పెట్టిన చిన్మయి, తనుశ్రీదత్తా తదితరులను గౌరవిస్తున్నా’ అని విశాల్ ట్వీట్ చేశారు. కాగా గతంలో నటి శ్రీరెడ్డి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై ఆరోపణలు చేసినప్పుడు ఆధారాలుంటే బయటపెట్టాలని ఆమెకు సూచించాడు. కొన్ని రోజుల కిందట తన స్నేహితురాలు, నటి వరలక్ష్మి సైతం లైంగిక వేధింపులకు గురైనప్పుడు ఆమె ధైర్యంగా ముందుకు వచ్చి దీనిపై పోరాడిందని అప్పట్లో విశాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







