గ్యాస్ సిలెండర్లపై రెస్టారెంట్స్‌కి హెచ్చరిక
- October 18, 2018
బహ్రెయిన్:గ్యాస్ సిలెండర్లు వినియోగించే రెస్టారెంట్లను అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించాలనీ, నిబంధనల ఉల్లంఘన జరిగితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. సల్మానియా ప్రాంతంలో గ్యాస్ సిలెండర్ ప్రమాదం కారణంగా నలుగురు చనిపోవడం, 30 మందికి పైగా గాయపడ్డంతో అధికార యంత్రాంగం రెస్టారెంట్స్‌పై నిఘా పటిష్టం చేసింది. క్యాపిటల్ గవర్నరేట్ గవర్నర్ షేక్ హిషామ్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్ ఖలీపా నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ అంశాలపై చర్చించారు. అధికారులు ఎప్పటికప్పుడు రెస్టారెంట్లపై తనిఖీలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. రెస్టారెంట్లు భద్రత, శుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







