మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కన్నుమూత
- October 18, 2018
ప్రముఖ రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ఎన్డీ తివారి కన్నుమూశారు. అస్వస్థతకు గురైన ఆయన కొద్ది రోజులుగా దిల్లీలోని సాకేత్ ఆస్పత్రిలోచికిత్స పొందుతూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగానూ ఆయన సేవలందించారు. 1925 అక్టోబర్ 18న ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌జిల్లా బాలూటి గ్రామంలో జన్మించిన తివారీ పూర్తి పేరు నారాయణ దత్ తివారి. ప్రస్తుతం ఆయన వయస్సు 92 ఏళ్లు. ఈ రోజే తివారి 93వ పుట్టిన రోజు కావడం గమనార్హం. 2007 ఆగస్టు 19న ఏపీ గవర్నర్‌గా నియమితులైన తివారి 2009 డిసెంబర్ మాసంలో తన పదవికి రాజీనామా చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







