మహేశ్ మేనల్లుడి సినిమా 'అదేనువ్వు అదేనేను' ఆరంభం.!
- October 18, 2018
అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. గురువారం దసరా సందర్భంగా ఆయన మొదటి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి సూపర్‌స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి 'అదేనువ్వు అదేనేను' అనే టైటిల్ ఖరారు చేశారు. 'నన్ను దోచుకుందువటే' సినిమాతో గుర్తింపు పొందిన నభా నటేష్ ఈ చిత్రంలో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'నన్ను దోచుకుందువటే'. ఈ సినిమాతో నభా నటేష్ నటిగా పరిచయం అయ్యారు. ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు ఇది ఆమె రెండో చిత్రంగా రూపుదిద్దుకోనుంది.
_1539863547.jpg)
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







