వాట్సాప్ లో మరో 3 కొత్త ఫీచర్లు.!
- October 18, 2018
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సప్ ప్రపంచంలో అమిత వేగంతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. రోజు రోజుకు కొత్త ఫీచర్లను అందిసూ ఎదురులేకుండా దూసుకెళుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అలరిస్తున్న ఈ దిగ్గజం తాజాగా మరో మూడు సరికొత్త ఫీచర్‌లను తీసుకొని రాబోతుంది. ఈ నేపధ్యంలో వాట్సాప్ లో రాబోతున్న ఆ కొత్త ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.
వెకేషన్ మోడ్: వాట్సాప్ లో ఉన్న సైలెంట్ మోడ్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. సహజంగా ఏదైనా చాట్ కాన్వర్జేషన్‌ని ఆర్కైవ్ చేసినప్పుడు, కొత్తగా ఆ కాంటాక్ట్ నుండి ఏదైనా మెసేజ్ వచ్చినట్లయితే అది అన్-ఆర్కైవ్ చేయబడుతుంది కదా. అయితే వెకేషన్ మోడ్ అందుబాటులో వచ్చిన తర్వాత, మీకు మీరు స్వయంగా unmute, unarchive చేసేంతవరకు ఆయా ఛాట్ కన్వర్‌జేషన్లు అలాగే ఆర్కైవ్ చేయబడి ఉంటాయి.అంతేకాదు, ఒక నిర్దిష్టమైన ఛాట్ మీ ఛాట్ లిస్టులో పబ్లిక్ గా కనబడకుండా ఉండాలంటే కూడా ఈ వెకేషన్ మోడ్ పనికొస్తుంది. ఒకసారి మీరు వద్దనుకున్న ఛాట్‌ని mute చేసి, archive చేసినట్లయితే ఇకపై అది ఛాట్ లిస్టులో నేరుగా కన్పించదు. ప్రస్తుతానికి సదుపాయం డెవలప్మెంట్ దశలో ఉంది. త్వరలో అందుబాటులోకి వస్తుంది.
సైలెంట్ మోడ్: ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్ లో వాట్సాప్ వాడుతున్న వినియోగదారులకు ఇది అందుబాటులోకి వచ్చింది. మ్యూట్ చేయబడిన ఛాట్‌లకు app badgeని హైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది డిఫాల్ట్గా ఎనేబుల్ చేయబడి ఉంటుంది. ఈ కారణం చేత ఇకపై మ్యూట్ చేయబడిన ఛాట్స్, గ్రూప్స్ నుండి మెసేజ్‌లు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఎలాంటి బ్యాడ్జ్ మనకు కనిపించదు.
లింక్డ్ అకౌంట్స్: వాట్సప్ అకౌంట్లను ఎక్స్టర్నల్ సర్వీస్లతో లింకు చేసే వెసులుబాటు కల్పిస్తుంది. ప్రత్యేకంగా ఇది వాట్సప్ బిజినెస్ వినియోగదారులకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇది అందుబాటులోకి రాకపోయినప్పటికీ ప్రొఫైల్ సెట్టింగ్స్ విభాగంలో ఇది మనకు కనిపిస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







