నిఖిల్..నివేద..'శ్వాస'
- October 18, 2018
హైదరాబాద్: యువ కథానాయకుడు నిఖిల్, నివేదా థామస్ జంటగా ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. కిషన్ కట్టా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఈ చిత్రానికి 'శ్వాస' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విజయదశమిని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈరోజు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశాయి. పోస్టర్‌లో నిఖిల్, నివేదా ఓ రహదారిపై నడుచుకుంటూ వెళుతున్నట్లు కన్పించారు. నిఖిల్ ఆకాశం వైపు టార్చ్‌లైట్‌ను చూపిస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
తేజ్ ఉప్పలపాటి, హరిణికేశ్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిఖిల్ 'ముద్ర' అనే మరో చిత్రంతోనూ బిజీగా ఉన్నారు. సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 2016లో వచ్చిన 'కణిథన్' అనే తమిళ చిత్రానికి ఇది రీమేక్‌గా రాబోతోంది. ఇందులో నిఖిల్‌కు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. నిఖిల్ విలేకరి పాత్రను పోషిస్తున్నారు. మరోపక్క నివేదా..కల్యాణ్ రామ్‌కు జోడీగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీనిలో షాలిని పాండే మరో కథానాయికగా కన్పించనున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







