షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న మోదీ

- October 19, 2018 , by Maagulf
షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న మోదీ

ముంబై : ప్రధాని నరేంద్ర మోదీ షిర్డీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా షిర్డీ సాయిబాబాను ప్రధాని మోదీ, గవర్నర్ విద్యాసాగర్‌రావు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు. బాబా మహాసమాధి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం షిర్డీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(గ్రామీణం) పథకం లబ్దిదారులకు మోదీ తాళంచెవులు అందజేశారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాగ్‌పూర్, నందూర్‌బార్ మరియు సోలాపూర్‌కు చెందిన లబ్దిదారులతో మోదీ ముచ్చటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com