బ్రిటన్ పార్లమెంట్లో రోబో.!
- October 19, 2018
బ్రిటన్ పార్లమెంట్‌కు తొలిసారిగా ఓ రోబో వచ్చింది. విద్యాసంస్థలు తరగతి గదుల్లో అనుసరించాల్సిన నూతన సాంకేతిక విద్యా విధానాలను ఎంపీలకు వివరించేందుకు రోబోను పార్లమెంట్‌కు తీసుకురావడం విశేషం. సాంకేతిక విద్య ప్రాధాన్యత, పారిశ్రామిక విప్లవం గురించి పలువురు ఎంపీలు ప్రశ్నించగా రోబో సవివరంగా సమాధానాలు చెప్పింది. రోబోల అభివృద్ధి కోసం పలు సాఫ్ట్‌స్కిల్స్ ప్రవేశపెట్టేందుకు ఎంపీలంతా కృషి చేయాలని రోబో కోరడంతో ఆశ్చర్యపోవడం పార్లమెంట్ సభ్యుల వంతైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంపీలకు వివరించేందుకు రోబోను పార్లమెంట్ కమిటీ సభ్యుల ముందుకు తీసుకొచ్చినట్టు రోబోటిసిస్ట్ డాక్టర్ అలీ షాఫ్టీ చెప్పారు. తాను లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌లో పనిచేస్తున్నానని, రోబోల సాయంతో విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చొని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







