'2.0' చిత్రం నుండి లిరికల్ వీడియోలు విడుదల
- October 20, 2018
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ 2.ఓ. నవంబర్ 29న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ వినాయక చవితి శుభాకాంక్షలతో విడుదల కాగా, ఈ టీజర్ 24 గంటలలో 32 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రాబట్టి అందరికి షాక్ ఇచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలం అందరిని అబ్బురపరచగా, చివరలో రజనీ స్పెడ్స్‌ని పైకి ఎత్తి కుకూ అంటూ చెప్పే డైలాగ్ అభిమానులు ఉర్రూతలూగేలా చేసింది. ఈ చిత్రం కోసం 1000 మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్స్ పని చేయగా, కాన్సెప్ట్ ఆర్టిస్టులు 10, 3డీ డిజైనర్స్ 25 మంది, క్రాఫ్ట్స్ మాన్ 500 మంది పని చేశారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అమీజాక్సన్‌లు చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. దాదాపు 545 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించింది లైకా సంస్థ. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచుతుంది. తాజాగా రెండు లిరికల్ సాంగ్ వీడియోలని విడుదల చేసింది మూవీ టీం. ఎందిర లోగొత్తు సుందరియ, రాజాలి అంటూ సాగే ఈ పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఏఆర్ రెహమాన్ స్వరపరచిన బాణీలకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







