'పెట్ట' షూటింగ్ పూర్తి
- October 20, 2018'కాలా' చిత్రం అనంతరం కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న చిత్రం 'పెట్ట'. ఎవరూ ఊహించని కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. త్రిష, సిమ్రాన్, విజయ్‌సేతుపతి, బాబిసింహా, శశికుమార్, సీనియర్ దర్శకుడు మహేంద్రన్ వంటి పెద్ద తారాగణంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రజనీకాంత్ కళాశాల వార్డెన్‌గా, ఫ్లాష్‌బ్యాక్‌లో సైనిక అధికారిగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. డార్జిలింగ్, కులూమనాలి, వారణాసి, చెన్నై తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. శుక్రవారంతో షూటింగ్ పూర్తయిందని సూపర్‌స్టార్ రజనీకాంత్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 'పెట్ట' చిత్రీకరణ పూర్తయింది. అనుకున్న దానికన్నా 15 రోజులు ముందుగానే ఈ పని కానిచ్చేశారు. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్, ఇతర యూనిట్ సభ్యులకు అభినందనలు. అందరికీ పండుగ శుభాకాంక్షలు' అని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండటం విశేషం. ఇటీవల 'కాలా'తో వచ్చిన రజనీకాంత్... నవంబరు ఆఖరులో '2.ఓ'తో అలరించనున్నారు. రెండు నెలల గ్యాప్‌లోనే మళ్లీ ప్రేక్షకులను 'పెట్ట' తో మురిపించేందుకు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్‌కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్‌ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక