ఆకాశంలో విందు.. ఆరగిస్తే ఆదమరచీ పోతారు..!
- October 21, 2018
ఆకాశంలో.. 160 అడుగుల ఎత్తులో మనకు ఇష్టమైన విందు ఆరగిస్తూ ఉంటే.. అబ్బా.. ఆ రుచే వేరే.. ఇలా ఆలోచిస్తుంటే ఆదమరచీ కలకాలం అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది కదా..! అంత ఎత్తులో గాల్లో వేలాడుతూ అలాంటి థ్రిల్‌ను అనుభవించాలంటే మనం బెంగళూరు వెళ్లాల్సిందే. ‘జంపింగ్ ఇండియా అనే అడ్వేంచర్ స్పోర్ట్స్ కంపెనీ’ ఈ సాహోసోపేత ‘ఫ్లై డైనింగ్’ ఎక్స్పీయరెన్స్ని దేశంలో తొలిసారిగా బెంగళూరులో ప్రారంభించింది.
మాన్యతా టెక్ పార్క్‌లోని నాగవర లేక్ ఒడ్డున ఉన్న ఈ రెస్టారెంట్ 160 అడుగుల వరకు గాల్లో ఎగురుతుంది. 24 కుర్చీలు, పెద్ద డైనింగ్ టేబుల్‌తో ఉండే ఈ రెస్టారెంట్‌ను క్రేన్ ద్వారా పైకి లేపుతారు. అంతా ఎత్తు నుంచి పడిపోకుండా ఉండేందుకు మూడు సీట్ బెల్టులను అమర్చారు. ఇలా ఇండియాలో ఏర్పాటు చేసిన తొలి ఫ్లై డైనింగ్ రెస్టారెంట్ ఇదే కావటం విశేషం.
అయితే ఈ రెస్టారెంట్లోకి అందరిని అనుమతించారు. ఇందులోకి వెళ్లాలంటే కనీస ఎత్తు 4.5 అడుగులు ఉండాలి. బరువుతో సంబంధం లేదు.. ఎంతైనా ఉండవచ్చు. గర్భిణీలు, 14 ఏళ్ల లోపు చిన్నారులను ఈ రెస్టారెంట్లోకి అనుమతించరు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







