అభ్యర్థులెవరూ హైదరాబాదులో కనపడొద్దు:కేసీఆర్
- October 21, 2018
అభ్యర్థులెవరూ హైదరాబాదులో కనపడొద్దని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. ఇప్పటికే ప్రకటించిన 105 మంది అభ్యర్థులు, ఎంపీలతో 3 గంటలకు పైగా కొనసాగిన సమావేశంలో ప్రచార వ్యూహంపై మార్గనిర్దేశం చేశారు. ప్రతిపక్షాల మేనిఫెస్టోను కాపీ కొట్టామన్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని కేసీఆర్ సూచించారు. 10, 15 చోట్ల ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ సర్వే రిపోర్టులను చూపించారు. ప్రతి నియోజకవర్గంలోను అభ్యర్థుల బలాబలాలను ఆయన విడివిడిగా చర్చించారు. అభ్యర్థుల పరిస్థితిని సమీక్షించారు. గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్న అభ్యర్థులను కేసీఆర్ హెచ్చరించారు. ఈ 40 రోజుల పాటు అభ్యర్థులెవరూ హైదరాబాదులో కనిపించడానికి వీల్లేదని, నియోజకవర్గాల్లో ప్రచారాన్ని తీవ్రతరం చేయాలని హుకుం జారీ చేశారు.
కేసీఆర్ మరోసారి సీఎం కావడం చారిత్రక అవసరమన్నారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి. టీఆర్‌ఎస్ లో అసమ్మతి సద్దుమణిగిందన్నారు. 100 సీట్లలో గెలిచి చరిత్ర సృష్టించడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణపై టీఆర్ఎస్ కు ఉన్న బాధ మరో పార్టీకి లేదన్నారు కడియం. మహాకూటమి తమకు పోటీయే కాదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







