సౌదీ వివరణపై అసంతృప్తి గా ఉన్న ట్రంప్

- October 21, 2018 , by Maagulf
సౌదీ వివరణపై అసంతృప్తి గా ఉన్న ట్రంప్

వాషింగ్టన్‌ : ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్‌లోనే జర్నలిస్ట్‌ జమాల్‌ ఖషోగ్గి హత్య జరిగిందని సౌదీ అరేబియా ఇచ్చిన వివరణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ హత్యకు సంబంధించి టర్కీ కోరిన వివరాలు అందజేయాలని కోరారు. యూఎస్‌ ఆర్థికాభివృద్ధి కోసం సౌదీతో ద్వైపాక్షిక సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. సౌదీ యువరాజు మొహ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు ఈ హత్యతో సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఇస్తాంబుల్‌లోని సౌదీ దౌత్యకార్యాలయంలోనే ఖషోగ్గి హత్యకు గురైనట్టు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. కాన్సులేట్‌లో జరిగిన ఓ ఘర్షణలో అతను ప్రాణాలు కోల్పోయినట్టు సౌదీ స్టేట్‌ మీడియా శనివారం వెల్లడించింది. ఈ ఘటనతో సంబంధమున్న ఆరోపణలపై సౌదీకి చెందిన అయిదుగురు ఉన్నతాధికారులను తొలిగించారు. మరో 18 మందిని అరెస్టు చేశారు. ఈనెల2న సౌదీ కాన్సులేట్‌ లోపలికి వెళ్లిన ఖషోగ్గి బయటకు తిరిగి రాలేదు. అదృశ్యమైన ఖషోగ్గిని సౌదీని హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అతని శవాన్ని ముక్కలు ముక్కలు చేసి సమీప అడవుల్లో పడేసినట్టు పుకార్లు వచ్చాయి. ఈ హత్యా ఘటనను సిరీయస్‌గా తీసుకున్న అమెరికా ప్రభుత్వం సౌదీపై ఒత్తిడి తెచ్చింది. మొదట్లో ఖషోగ్గి గురించి తమకేమీ తెలియదన్న సౌదీ.. తాజాగా అతను కౌన్సులేట్‌లోనే హత్యకు గురైనట్టు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com