నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం.. చిన్నారి పరిస్థితి విషమం
- October 22, 2018
సికింద్రాబాద్‌లో గత రాత్రి సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం సృష్టించింది. ఇంపీరియల్ గార్డెన్ వద్ద ఈ ఘటన జరిగింది. రాంగ్‌రూట్లో దూసుకొచ్చిన దగ్గుబాటి కారు… అదుపు తప్పి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న దంపతులతో పాటు చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన దగ్గుబాటి సురేష్‌కు 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు.
ప్రమాద సమయంలో ఆయనే స్వయంగా కారుని నడిపినట్లు తెలుస్తోంది. సురేశ్ బాబు కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దానిపై సురేశ్ చంద్ర, ఆయన భార్య దుర్గాదేవి, వారి కుమారుడు సిద్ధేశ్ గాయపడ్డారు. ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతోన్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దుర్గాదేవికి స్వల్పగాయాలు కావడంతో ఆమెకు చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. చంద్రకు కాలికి గాయం కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు వేగం 100 కిలోమీటర్లపైనే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడాన్ని బట్టి కారు వేగాన్ని అంచనా వేసినట్లు చెబుతున్నారు.
ప్రమాదం జరిగినట్లు పోలీసులకు తెలియజేసిన సురేష్ బాబు అతనే స్వయంగా క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. కారును పోలీస్ స్టేషన్‌లో అప్పగించి పూచీకత్తుపై వెళ్లినట్లు పోలీసులు తెలియజేసారు.
తాజా వార్తలు
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర







