48 గంటల్లో విడోస్, డివోర్స్డ్ విమెన్ వీసా రెన్యువల్
- October 22, 2018
దుబాయ్:జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ), దుబాయ్ ఫెస్టివల్ సిటీలోని తమ సెంటర్‌ని విడోస్, డివోర్స్డ్ విమెన్ వీసాల ప్రాసెసింగ్ కోసం కేటాయించనుందని అధికారులు తెలిపారు. విడోస్, డివోర్స్డ్ విమెన్, వారి పిల్లలకి స్పాన్సర్ లేకుండా ఏడాదిపాటు వీసా గడువు పెంచుతూ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో ఈ సెంటర్‌ని వినియోగించనున్నారు. జిడిఆర్ఎఫ్ఎ డైరెక్టర్ ఆఫ్ ఎంట్రీ పర్మిట్స్ లెఫ్టినెంట్ కల్నల్ జసెమ్ అలి అహిల్ మాట్లాడుతూ, 12 మంది మహిళా ఉద్యోగులు, ఈ సెంటర్లో సేవలందిస్తారని చెప్పారు. ఈ కేసులు సెన్సిటివ్ అనీ, ప్రైవసీ వుండాల్సినవి కాబట్టి, వీటిని ప్రత్యేకంగా డీల్ చేస్తామని అన్నారాయన. కేవలం 48 గంటల్లోనే వీసా రెన్యువల్ ప్రాసెస్‌ని పూర్తి చేస్తారు. డివోర్స్ లేదా డెత్ సర్టిఫికెట్లను వీసా ప్రాసెసింగ్ కోసం సమర్పించాల్సి వుంటుంది. 100 దిర్హామ్‌ల ఫీజు చెల్లించాలి. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 నిమిషాల వరకు ఈ సెంటర్ తెరిచి వుంటుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్