స్వదేశానికి వస్తూ మార్గమధ్యంలో చిన్నారి..

- October 23, 2018 , by Maagulf
స్వదేశానికి వస్తూ మార్గమధ్యంలో చిన్నారి..

ఉపాధి కోసం కువైట్ వెళ్లింది కడప జిల్లా రాజంపేటకు చెందిన యడపల్లి శివ ప్రసాద్ కుటుంబం. భార్య బిడ్డలతో అక్కడ నివసిస్తున్నాడు. శివ ఒక ప్రముఖ ట్రావెల్ ఏజన్సీలో పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు స్వదేశానికి వచ్చి వెళుతూ అయిన వాళ్లందర్నీ పలకరిస్తుంటారు. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లినా భారత్ రావడమంటే తెలియని ఆనందం. కొన్ని రోజులు కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని శివ భార్యా, పిల్లలు కువైట్ నుంచి కడపకు వస్తున్నారు. మార్గమధ్యంలో వారి చిన్నారి యశ్విని తీవ్ర అస్వస్థతకు గురైంది.

ఇది గమనించిన ఎయిర్ పోర్ట్ సిబ్బంది విమానాన్ని ఒమన్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. వైద్యనిమిత్తంగా ఆసుపత్రికి తరలించే లోపే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. అయితే విమానంలో ఆక్సిజన్ సకాలంలో అందక చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఎయిర్‌లైన్స్‌కు తెలపకపోవడం వల్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com