'ITCA' ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 23, 2018ఇటలీ:తేది 21 అక్టోబర్ 2018 ఆదివారం రోజున “ఇటలీ తెలుగు సాంస్కృతిక సంఘం (ITCA)” ఆధ్వర్యంలో “రోం” లోని కాళీమందిర్ దేవాలయ ప్రాంగణంలో సుమారు 200 మంది తెలుగు బిడ్డల నడుమ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా "బతుకమ్మ సంబరాలు" ఎంతో అట్టహాసంగా జరిగాయి.
తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయలను ప్రతిబింబించే విధంగా ఆడపడుచులు సాంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరై బతుకమ్మ పాటలతో ఉత్సాహంగా ఆడి పాడడంతో ఆలయ ప్రాంగణం అంతా పండగ వాతావరణంతో నిండిపోయింది.
ఇతర దేశాలకు చెందిన మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటలీలో దొరికే వివిద రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేసి విదేశీవనితలు రోజంతా ఆడిపాడారు.
ఈ కార్యక్రమంలో ఈవెంట్ ఆర్గనైజర్స్ పిన్నమరెడ్డి సౌమ్యరెడ్డి, నల్లయగరీ అశ్వినిరెడ్డి, ITCA వ్యవస్థాపకులు కొక్కుల మనోజ్ కుమార్, నరబోయిన రాహుల్ రాజ్, మరియు ఇతర సభ్యులు ఆడెపు అనుదీప్, ప్రణవ్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!