హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
- October 23, 2018
హైదరాబాద్: హీరా గ్రూప్ సీఈఓ నౌహీరా షేక్ కస్టడీ పిటిషన్‌పై మంగళవారం నాంపల్లి కోర్టులో వాదనలు ముగిసాయి. నౌహీరాకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె తరఫు నాయవాది తధాని వాదనలు వినిపించారు. హీరా గ్రూప్‌కు సంబంధించి 2012 నుంచి ఈడీ దర్యాప్తు చేస్తోందని.. అయిన ఇప్పటివరకు ఈడీ అధికారులకు ఎటువంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. డిపాజిట్ దారుల సౌలభ్యం కోసమే 160 బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది ఆదాయ లావాదేవీలు సక్రమంగా జరుపుతున్నామని.. ఐటీ రిటన్స్ కూడా చెల్లిస్తున్నామని కోర్టులో వాదనలు వినిపించారు. తమపై ఉద్దేశ పూర్వకంగానే కేసులు నమోదు చేశారని తధాని కోర్టుకు తెలిపారు.
పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇప్పటికే నౌహీరాపై అనేక చోట్ల కేసుల నమోదయ్యాయని కోర్టుకు తెలిపారు. ఆమెను కస్టడీకి అనుమతిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా చాలామంది హీరా గ్రూప్ బాధితులు ఉన్నారని, విచారణ కొనసాగుతోందని, బాధితుల ఫిర్యాదు మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కోర్టులో వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







