పదవతరగతి అర్హతతో ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు..
- October 23, 2018
దేశంలోని వివిధ సబ్సిడరీ ఇంటిలిజెన్స్ బ్యూరోల్లో సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి కేంద్ర హోంమత్రిత్వ శాఖ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 1054 (తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 20, తెలంగాణలో 36 పోస్టులు ఉన్నాయి)
అర్హత: పదవతరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.
ప్రాంతీయ భాషలో ప్రావీణ్యం ఉండాలి. చదవడం, రాయడం, మాట్లాడడం తప్పనిసరి. ఇంటిలిజెన్స్ వర్క్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.
వయసు: 27 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా రెండు దశల్లో జరిగే ఈ రాత పరీక్ష మొదటి దశలో జనరల్ అవేర్నెస్కి సంబంధించిన ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్/అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేస్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. రెండో దశలో డిస్క్రిప్షన్ పేపర్ ఉంటుంది.
పే స్కేల్: రూ.5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే ఇతర అలవెన్సులు ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ సహా దేశ వ్యాప్తంగా 34 సెంటర్లలో నిర్వహిస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.10.2018
దరఖాస్తుకు చివరి తేదీ: 10.11.2018
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 13.11.2018
మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://mha.gov.in/
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!