యాక్సిడెంట్‌ విక్టిమ్‌కి హాస్పిటల్‌ బిల్లు నుంచి ఉపశమనం

- October 24, 2018 , by Maagulf
యాక్సిడెంట్‌ విక్టిమ్‌కి హాస్పిటల్‌ బిల్లు నుంచి ఉపశమనం

27 ఏళ్ళ భారతీయ వలసదారుడు సజీర్‌ కోలాతముకుయిల్‌ హాస్పిటల్‌ బిల్‌ని వెయివ్‌ చేయడం జరిగింది. ఉమ్‌ అల్‌ కువైన్‌లోని షేక్‌ ఖలీఫా హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, డాక్టర్ల టీమ్‌ ప్రత్యేకంగా ఈ కేసుని పరిగణించి, బిల్లు నుంచి బాధితుడికి ఉపశమనం కల్పించారు. క్రానియోప్లాస్టీ (స్కల్‌ సర్జరీ), ఫ్రాక్చర్స్‌, ఇతర వైద్య చికిత్సలకు సంబంధించి బిల్లుని వెయివ్‌ చేశారు. మూడు నెలలపాటు సజీర్‌కి పలు రకాలైన సర్జరీలను నిర్వహించారు. ప్రస్తుతం సజీర్‌ కోలుకోవడంతో, అతన్ని డిశ్చార్జి చేయనున్నారు. ఆగస్ట్‌ 14న సజీర్‌ ఆసుపత్రిలో చేరారు. సోదరుడితో కలిసి వెళుతుండగా సజీర్‌ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో సజీర్‌ సోదరుడు సాజిద్‌ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సజీర్‌కి తీవ్ర గాయాలయ్యాయి. సోదరులిద్దరూ కేరళలోని కోజికోడ్‌కి చెందినవారు. సాజిద్‌ వాహనాన్ని నడుపుతున్నాడు. వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాజిద్‌ మృతదేహాన్ని కేరళకు ఆగస్ట్‌ 16న పంపడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com