మలయాళంలో మాట్లాడనున్న రంగస్థలం చిట్టిబాబు

- October 24, 2018 , by Maagulf
మలయాళంలో మాట్లాడనున్న రంగస్థలం చిట్టిబాబు

పల్లెటూరి నేపథ్యంతో సుకుమార్ తెరకెక్కించిన అద్భుత చిత్రం రంగస్థలం. రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా ఈ చిత్రంలో కనిపించాడు. సమంత పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయలు తమ తమ పాత్రలలో జీవించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. విమర్శకులు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారంటే ఈ చిత్రం ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ 2018' లోను 'రంగస్థలం' ఎంపికైంది. ఉత్తమ చిత్ర విభాగంలో ఈ సినిమాని ఎంపిక చేశారు. చైనాలో ను ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి కేరళలో రిలీజై భారీ వసూళ్లు సాధించగా, ఇప్పుడు రంగస్థలం చిత్రాన్ని కూడా కేరళలో విడుదల చేయబోతున్నారు. బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆర్‌డీఐ ఇల్యుమినేషన్‌ రంగస్థలం మూవీ ని కేరళలో రిలీజ్ చేయనుంది. భాగమతి, భరత్ అనే నేను, గీత గోవిందం, అరవింద సమేత చిత్రాలని కూడా ఈ సంస్థ కేరళలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. నవంబర్‌లో రంగస్థలం మలయాళ వర్షెన్‌ కేరళలో విడుదల కానున్నట్టు సమాచారం. అక్కడ కూడా ఈ మూవీ భారీ విజయం సాధిస్తుందని టీం భావిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com