ఒమన్ డాక్టర్‌కి ప్రైడ్ అవార్డ్
- October 24, 2018
ఒమన్‌లో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ దీపక్ శర్మకి 'ప్రైడ్ ఆఫ్ మిడిల్ ఈస్ట్' పురస్కారం దక్కింది. హోమియోపతిక్ డాక్టర్ అయిన డాక్టర్ దీపక్ శర్మ, గత కొన్నేళ్ళుగా మిడిల్ ఈస్ట్‌లో.. ప్రత్యేకించి, ఒమన్‌లో అందిస్తున్న సేవలకుగాను హెల్త్ కేర్ ఎక్స్‌లెన్స్ అవార్డ్‌ని అందించడం జరిగింది. గత 23 ఏళ్ళుగా వైద్య రంగంలో అసమాన్యమైన సేవలందిస్తున్నారు డాక్టర్ దీపక్ శర్మ. థాయిలాండ్‌కి చెందిన ప్రిన్సెస్ డాక్టర్ మామ్ లువాంగ్ రాజాదారాశ్రీ జయంకుర, భారత లోక్ సభ సభ్యుడు డాక్టర్ ఉదిత్ రాజ్ ఈ పురస్కార ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్లోబల్ అచీవర్స్ అలియన్స్ ఈ కార్యక్రమాన్ని బ్యాంకాక్‌లో నిర్వహించింది. 23 ఏళ్ళ క్రితం ఒమన్‌లో తనకు హోమియోపతీ వైద్యంలో ప్రాక్టీస్ కోసం అనుమతినిచ్చిన సుల్తాన్ కబూస్ బిన్ సైద్కి కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ దీపక్.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!