ఎతిహాద్ విమానంలో మహిళ ప్రసవం
- October 24, 2018
ముంబయి:యూఏఈలోని అబుదాబీ నుంచి ఇండోనేషియాలోని జకార్తా వెళ్తోన్న ఎతిహాద్ విమానంలో బుధవారం ఉదయం ఇండోనేషియాకు చెందిన మహిళ ప్రసవించింది. మెడికల్ ఎమర్జెన్సీ కావడంతో ఈవై 474 విమానాన్ని వెంటనే ముంబయికి మళ్లించారు. ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో ల్యాండ్కాగానే మహిళను అంధేరీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డకు చికిత్స అందించామని, ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అత్యవసర ల్యాండింగ్ వల్ల విమానం రెండు గంటలు ఆలస్యంగా గమ్యస్థానం చేరుతున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్