ఇంటర్ ఉత్తీర్ణతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు..

- October 24, 2018 , by Maagulf
ఇంటర్ ఉత్తీర్ణతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో ఉద్యోగాలు..

గ్రేడ్ సి & డి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల భర్తీకి ఉద్దేశించిన ఎగ్జామినేషన్‌కు ప్రకటన వెలువడింది.

అర్హత: పన్నెండో తరగతి/ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 2019 జనవరి 1 నాటికి సీ గ్రేడ్ ఉద్యోగాలకు 18 నుంచి 30 ఏళ్ల వరకు, డీ గ్రేడ్ ఉద్యోగాలకు 18 నుంచి 27 మధ్య ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా జరుగుతుంది.

పరీక్ష తేదీలు: 2019 ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు

పరీక్ష విధానం: పరీక్ష సమయం 2 గంటలు.
ఇందులో మూడు పార్టులు ఉంటాయి.
పార్ట్ 1 లో జనరల్ ఇంటిలిజెన్స్ మరియు రీజనింగ్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.
పార్ట్ 2 లో జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి.
పార్ట్ 3లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. ప్రశ్నలన్నీ అబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. పార్ట్ 3 మినహా అన్ని ప్రశ్నలను ఇంగ్లీషు, హిందీ మాధ్యమాల్లో ఇస్తారు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కట్ చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్.

దరఖాస్తు ఫీజు: రూ.100

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 19.

జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులను కూడా ఎస్‌ఎస్‌సి భర్తీ చేయనుంది.

పోస్టులు: జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, సీనిమర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రద్యాపక్.

అర్హత: ఉద్యోగ నిబంధనలను అనుసరించి డిగ్రీ, పీజీ, బీఎడ్, డిప్లొమా, సర్టిఫికెట్ 
కోర్సులు పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ స్థాయిలో హిందీ/ ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

పరీక్ష వివరాలు: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 లో జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో ట్రాన్స్‌లేషన్, ఎస్సే రైటింగ్ ఉంటాయి.

పేపర్ 1 పరీక్ష తేదీ: 2019 జనవరి 12
పేపర్ 2లో ట్రాన్స్‌లేషన్, ఎస్సే పేపర్2 పరీక్షను తరువాత ప్రకటిస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ

దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 19

వెబ్‌సైట్: https://ssc.nic.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com