హైదరాబాద్‌లో మహా ఉద్యోగమేళా..ఆంధ్ర - తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

- October 24, 2018 , by Maagulf
హైదరాబాద్‌లో మహా ఉద్యోగమేళా..ఆంధ్ర - తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త

ట్రేడ్‌ హైదరాబాద్‌ డాట్‌ కామ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 26,27,28 తేదీల్లో హైదరాబాద్‌లో మహా ఉద్యోగమేళా జరగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగే ఈ జాబ్‌ మేళాలో 120కి పైగా కంపెనీలు పాల్గొంటున్నాయి. ఇంధన, సౌర, మొబైల్, హాస్పిటాలిటీ, సివిల్‌, మెకానికల్‌, జ్యూవెలరీ, బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌, ఆటోమొబైల్‌, సహా ఇతర రంగాలకు చెందిన సంస్థలు 35 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

మహా ఉద్యోగ మేళా 2018 బ్రోచర్‌ను ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ కార్యాలయంలో బిజినెస్ అడ్వయిజరీ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ కె. శ్రీరాం మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 5వ తరగతి విద్యార్హత మొదలు డిగ్రీ, సీఏ, సీఎస్, బీడీఎస్, ఎంబీబీఎస్ వరకు ఈ మేళాలో ఉద్యోగాలు పొందవచ్చునని అన్నారు.

ఒకవేళ తగిన విద్యార్హతలు లేకపోయినా టెక్నికల్, నాన్ టెక్నికల్‌లో ఇదివరకు అనుభవం ఉన్నవారు, పని సామర్థ్యం కలిగినవారు కూడా పాల్గొనవచ్చునని తెలిపారు. ఈ మహా జాబ్ మేళాను రికార్డ్ చేసేందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ కూడా నగరానికి వస్తున్నట్టు తెలిపారు. మేళాలో పాల్గొనాలనుకునేవారు మరిన్ని వివరాల కోసం www.TradeHyd.com లేదా 6303659724 నెంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com